రైతన్నలో గుబులు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:30 AM
మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలో చల్లని వాతావరణం నెలకొనడమే కాకుండా మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 54 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని మండలాల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని మండలాల్లో వరి గింజకట్టి కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వరి కోతలు పూర్తి చేసుకొని రైతులు కుప్పలు వేసుకుంటున్నారు.
- వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలో చల్లని వాతావరణం నెలకొనడమే కాకుండా మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 54 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని మండలాల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని మండలాల్లో వరి గింజకట్టి కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వరి కోతలు పూర్తి చేసుకొని రైతులు కుప్పలు వేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో రైతులు కోసిన వరి కంకులు ఇంకా పనల మీద ఉన్నాయి. ఈ తరుణంలో రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇతర పంటల పరిస్థితి అదే విధంగా ఉంది. కొద్ది రోజుల్లో పండిన వరి పంట చేతికందుతుందన్న తరుణంలో మళ్లీ వర్షాలు పడితే నష్టపోవాల్సి వస్తుందని రైతులు గుబులు చెందుతున్నారు. బుధవారం జిల్లాలో ఎక్కడా వర్షం పడకపోయినా వాతావరణ శాఖ రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుండడంతో రైతులు ఇప్పటికే కోసిన వరి పనలను జాగ్రత్త చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కోత పనులను వాయిదా వేసుకుంటున్నారు.