Share News

పంట కుంటల నిర్మాణంలో జిల్లా టాప్‌

ABN , Publish Date - May 07 , 2025 | 12:26 AM

జాతీయ ఉపాధి హామీ పథకంలో పంట కుంటల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 12,147 కుంటల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటికే 4,210 నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగరరావు తెలిపారు.

పంట కుంటల నిర్మాణంలో జిల్లా టాప్‌
డుంబ్రిగుడ మండలం బైలుగూడలో పంట కుంట

- రైతులకు బహుళ ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ పథకంలో నిర్మాణం

- జిల్లా వ్యాప్తంగా 12,147 కుంటల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటికే 4,210 పూర్తి

- ఈ నెలాఖరుకు లక్ష్యం పూర్తి: డ్వామా పీడీ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జాతీయ ఉపాధి హామీ పథకంలో పంట కుంటల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 12,147 కుంటల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటికే 4,210 నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగరరావు తెలిపారు.

రైతులకు బహుళ ప్రయోజనం కలిగేలా భూసారాన్ని కాపాడడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం, రైతుల అవసరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో జాతీయ ఉపాధి పథకంలో పంట కుంటల నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రోత్సహిస్తున్నది. సొంత భూములున్న రైతులు లేదా అధిక విస్తీర్ణంలో సాగు భూములున్న ప్రదేశాల్లో ఎక్కడైనా ఉపాధి హామీ పథకంలో పంట కుంటలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో గతానికి భిన్నంగా ప్రస్తుతం అధిక సంఖ్యలో పంట కుంటల నిర్మాణం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల కుంటల నిర్మాణం లక్ష్యం కాగా, అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 12,147 కుంటలుండడం విశేషం.

రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కించుకున్న జిల్లా

ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో పంట కుంటల నిర్మాణంలో జిల్లాకు ప్రఽథమ స్థానం దక్కింది. మొత్తం 26 జిల్లాల్లో అల్లూరి జిల్లాలో 4,210 కుంటల నిర్మాణంతో ప్రథమ, అన్నమయ్య జిల్లాలో 3,067తో ద్వితీయ, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,521తో తృతీయ స్థానంలో నిలిచాయి. జిల్లాలోని ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి లక్ష్యానికి మించి పంట కుంటల నిర్మాణం చేపడుతుండడంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. జిల్లాలోని మొత్తం 22 మండలాల పరిధిలో 10,425 పంట కుంటలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు చేపట్టినప్పటికీ, రైతుల డిమాండ్‌ మేరకు 12,147 కుంటల నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అందుకు అడుగులు ముందుకు వేశారు. దీంతో ప్రస్తుతం మొత్తం 12,147 కుంటలకు గాను 4,210 పూర్తికాగా, 7,733 కుంటలు వివిధ దశల్లో ఉన్నాయి. మిలిగిన 2,705 కుంటల నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. అయితే నిర్మాణంలో ఉన్న, మొదలు కావాల్సిన పంట కుంటల నిర్మాణాలను సైతం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను వేగవంతం చేస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగరరావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ఈ ఏడాది వర్షాల సీజన్‌ నాటికి ఆయా పంట కుంటలను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో పంట కుంటల నిర్మాణం ప్రస్తుత స్థితిగతులు

వ.సం మండలం మంజూరైనవి పూర్తి ప్రగతిలో పెండింగ్‌

1. జి.మాడుగుల 605 153 291 209

2. కొయ్యూరు 850 263 715 106

3. పెదబయలు 671 181 344 206

4. రంపచోడవరం 527 135 232 168

5. అడ్డతీగల 574 187 429 121

6. కూనవరం 385 110 197 103

7. చింతూరు 573 166 375 75

8. హుకుంపేట 1,008 306 594 231

9. ముంచంగిపుట్టు 664 224 457 118

10. పాడేరు 700 234 426 174

11. రాజవొమ్మంగి 524 167 222 178

12. చింతపల్లి 511 211 413 87

13. అనంతగిరి 619 259 452 148

14. డుంబ్రిగుడలో 503 196 343 107

15. నెల్లిపాక 593 197 316 134

16. మారేడుమిలి 288 141 177 134

17. గంగవరం 368 143 221 79

18. అరకులోయ 400 198 280 120

19. దేవీపట్నం 339 149 246 54

20. జీకేవీధి 560 254 513 0

21 వై.రామవరం 541 204 285 115

22. వీఆర్‌.పురం 344 132 201 49

-----------------------------------------------------------------------------------------------

మొత్తం 12,147 4,210 7,733 2,705

-----------------------------------------------------------------------------------------------

Updated Date - May 07 , 2025 | 12:26 AM