Share News

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:01 AM

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సమీర్‌శర్మ పిలుపునిచ్చారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
ఉపకరణాలు అందుకున్న దివ్యాంగులతో సింహాద్రి ఎన్టీపీసీ ఈడీ సమీర్‌శర్మ, తదితరులు

సింహాద్రి ఎన్టీపీసీ ఈడీ సమీర్‌శర్మ

పరవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సమీర్‌శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దీపాంజలినగర్‌ టౌన్‌షిప్‌లో బుధవారం రాత్రి దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఈడీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం సంస్థ సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా 90 మంది దివ్యాంగులకు రూ. 9.25 లక్షల విలువ గల వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, తదితర ఉపకరణాలను ఈడీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి వివిధ విభాగాల జీఎంలు, ఏజీఎంలతో పాటు పరవాడ భవిత కేంద్రం ఉపాధ్యాయులు, దివ్యాంగుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:01 AM