అర్హులకు అన్నదాత సుఖీభవ అందాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:36 AM
అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ దినేశ్‌కుమార్
హుకుంపేట నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన మండలంలోని సూకూరు సచివాలయ పరిధిలో రైతన్నా.. మీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ నగదు బ్యాంకు ఖాతాలో జమకాకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి నందు, ఉద్యాన శాఖాధికారి కర్ణ, తదితరులు పాల్గొన్నారు.