కరుణకుమారికి డిప్యూటీ సీఎం రూ.5 లక్షలు ఆర్థిక సాయం
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:10 PM
మండలంలో వంట్లమామిడి గ్రామానికి చెందిన అంధుల క్రికెటర్ పాంగి కరుణకుమారికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు.
పాడేరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో వంట్లమామిడి గ్రామానికి చెందిన అంధుల క్రికెటర్ పాంగి కరుణకుమారికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. అంధుల మహిళా క్రికెట్ జట్టు సభ్యులు, కోచ్‌లు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ ఒక్కొక్క క్రికెటర్‌కు రూ. 5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షలు చొప్పున అందించారు. అలాగే కరుణకుమారికి ప్రభుత్వం తరపున అందాల్సిన సాయాన్ని తక్షణమే అందిస్తామని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.