Share News

నేర విచారణలో శాస్త్రీయ ఆధారాల సేకరణ కీలకం

ABN , Publish Date - May 08 , 2025 | 01:04 AM

నేర విచారణలో శాస్త్రీయమైన ఆధారాల సేకరణ అత్యంత కీలకమని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులకు ఆధునిక పద్ధతుల్లో సాక్ష్యాలు, ఆధారాల సేకరణపై బుధవారం ఇక్కడ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

నేర విచారణలో శాస్త్రీయ ఆధారాల సేకరణ కీలకం
పోలీస్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

పోలీస్‌ అధికారులకు ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ సూచన

పాడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): నేర విచారణలో శాస్త్రీయమైన ఆధారాల సేకరణ అత్యంత కీలకమని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులకు ఆధునిక పద్ధతుల్లో సాక్ష్యాలు, ఆధారాల సేకరణపై బుధవారం ఇక్కడ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. నేరాలకు పాల్పడిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా అవసరమైన అన్ని సాక్ష్యాలు, ఆధారాలను పక్కాగా సేకరించాలని, ఈ క్రమంలో ఆధునిక పద్ధతులు, ఫోరెన్సిక్‌ ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒక నేరానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ పక్కా ఆధారాలను సేకరించాలని, ఆడియో, వీడియో, భౌతిక సాక్ష్యాలు, రక్తనమూనాలు, డీఎన్‌ఏ, మానవ అవయవాలు, తదితర అన్నింటిని పక్కాగా సేకరించాలన్నారు. దర్యాప్తు లేదా విచారణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయా సాక్ష్యాలు, ఆధారాలను సేకరించడం ద్వారా నేరాన్ని నిరూపిస్తే, నేరాలకు పాల్పడే వారికి ,చట్టపరంగా శిక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా ప్రతి పోలీస్‌ అధికారులు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ పంకజ్‌కుమార్‌, నవజ్యోతి మిశ్రా, డీఎస్‌పీలు షెహబాజ్‌ అహ్మద్‌, సాయిప్రసాద్‌, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 01:04 AM