తీరంలో ఆకట్టుకుంటున్న సిఎం సైకత శిల్పం
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:40 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర తీరంలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది.
ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
బీచ్ రోడ్డు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగర తీరంలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ మాట్లాడుతూ ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసే రాజకీయ నేతగా చంద్రబాబునాయుడు అందరి మదిలో నిలిచిపోతారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం పరితపించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు గాను విశాఖకు భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.