2న ముఖ్యమంత్రి రాక?
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:16 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీన నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల రెండో తేదీన నగరానికి రానున్నారు. తూర్పుతీరంలో నౌకా వ్యాపారం విస్తరణ, ఇతర అంశాలపై మంగళవారం ఉదయం నోవాటెల్ హోటల్‌లో జరగనున్న ఈస్టుకోస్టు మేరిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.