కార్పొరేట్ సంస్థలకు కేంద్రం దాసోహం
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:36 PM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాసోహమంటోం దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపణ
తుమ్మపాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాసోహమంటోం దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో వేలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు తక్కువ ధరకు కట్టబెడుతున్నారన్నారు. విద్య, వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోదీ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శిగా రాజన్న దొరబాబు, జిల్లా సహాయ కార్యదర్శిగా రెడ్డి అప్పలరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్రాంతి వెంకటరమణ, జగ్గారావు, గురుబాబు, పరమేశ్వరి, రాధాకృష్ణ, ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.