Share News

జాలువారుతున్నజలపాత సౌందర్యం

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:19 PM

ఎతైన పచ్చని గిరులు.. వాటి పైనుంచి జాలువారే పాల పొంగులు.. మదిని దోచిన సౌందర్యం రంగినిగూడ జలపాతం సొంతం. ఎతైన బండరాళ్లు, చెట్ల మధ్య నుంచి వయ్యారాలు ఉలుకుతూ దూకుతున్న జలపాత సౌందరాన్ని చూడాలంటే రెండు కళ్లు సరిపోవడం లేదంటే అతిశయోక్తి లేదు.

జాలువారుతున్నజలపాత సౌందర్యం
ఉరకలేస్తూ జలపాతం ప్రహిస్తున్న దృశ్యం

మదిని దోచే రంగినిగూడ పాల పొంగులు

పచ్చని గిరుల నుంచి వయ్యారంగా ఉరకలు

మైమరపిస్తున్న ప్రకృతి అందాలు

ముంచంగిపుట్టు, జులై 5 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ సమీపంలో నిశ్శబ్దంగా ఉండే చిట్టడవిలో గలగల పారే జలపాతం పది రోజులుగా కురిసిన వర్షాలకు సందడి చేస్తోంది. అయితే ఆ జలపాతం వద్దకు చేరుకోవడానికి సాహసోపేతమైన ప్రయాణం చేయాలి. అయినప్పటికీ ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు ఉత్సాహం చూపుతున్నారు. పర్యాటకంగా పేరుగాంచక పోయినా రంగినిగూడ జలపాతం అందాలు పర్యాటకులను మైమరపిస్తాయి. జలపాతానికి చేరుకోవాలంటే ముందుగా ముంచంగిపుట్ట మీదుగా లక్ష్మీపురం వెళ్లాలి. అక్కడ నుంచి బుంగాపుట్టు సమీపంలో గల రంగినిగూడ వరకు 22 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణం చేయాలి. రంగినిగూడ నుంచి సుమారు ఒక కిలోమీటరు కాలినడకన వెళితే జలపాతానికి చేరుకుంటాం. రంగినిగూడ జల సౌందర్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాలో బంధించింది.

Updated Date - Jul 05 , 2025 | 11:19 PM