అప్పన్న సన్నిధిలో ‘అఖండ-2’ టీమ్
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:57 AM
‘అఖండ-2’ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రామ్ ఆచంట మంగళవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
సింహాచలం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
‘అఖండ-2’ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రామ్ ఆచంట మంగళవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులకు దేవస్థానం డిప్యూటీ ఈఓ సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తదితరుల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. అనంతరం కప్పస్తంభ ఆలింగనం, బేడామండప ప్రదక్షిణ, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేసిన తరువాత ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా, అధికారులు శాలువాతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.