Share News

ఆలయాల భూములు అన్యాక్రాంతం

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:52 AM

దేవదాయ శాఖ భూములను ఆక్రమించుకుంటున్న వ్యక్తులు.. రెవెన్యూ అధికారుల అండదండలతో వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకుని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందుతున్నారు. మరికొంతమంది రైతులు ఏళ్ల తరబడి దేవదాయ శాఖ భూములను సాగు చేసుకుంటూ, ఒక్క రూపాయి కూడా కౌలు చెల్లించడంలేదు. మండలంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ వాటిని కాపాడడంలో దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆలయాల భూములు అన్యాక్రాంతం
దేవదాయ శాఖ భూమిలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

దేవదాయ శాఖ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్న ఆస్తులు

200 ఎకరాలకు అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు

వైసీపీ హయాంలో అడ్డగోలుగా జారీ చేసిన అధికారులు

మాడుగుల, ఆగస్టు 26 (ఆంరఽధజ్యోతి): దేవదాయ శాఖ భూములను ఆక్రమించుకుంటున్న వ్యక్తులు.. రెవెన్యూ అధికారుల అండదండలతో వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకుని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందుతున్నారు. మరికొంతమంది రైతులు ఏళ్ల తరబడి దేవదాయ శాఖ భూములను సాగు చేసుకుంటూ, ఒక్క రూపాయి కూడా కౌలు చెల్లించడంలేదు. మండలంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ వాటిని కాపాడడంలో దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పూర్వకాలంలో మాడుగులను పాలించిన సంస్థ్థనాధీసులు ఈ ప్రాంతంలోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా విరివిగా భూములను కేటాయించారు. మాడుగులోని పార్థసారథి ఆలయానికి 360.87 ఎకరాలు, వేంకటేశ్వర స్వామి ఆలయానికి 278.91 ఎకరాలు, రాధకాంతస్వామి ఆలయానికి 213.32 ఎకరాలు, భీమలింగేశ్వరస్వామి ఆలయానికి 20.80 ఎకరాలు, జగన్నాఽథస్వామి ఆలయానికి 29.62 ఎకరాలు, వేణుగోపాలస్వామి ఆలయానికి 48.57 ఎకరాలు, సీతారామస్వామి ఆలయానికి 75.54 ఎకరాలు, నూకాలమ్మ ఆలయానికి 12.37 ఎకరాలు వున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఆయా భూములను రైతులు సాగు చేసుకుంటూ, ఏటా ఆలయాలకు కౌలు చెల్లించేవారు. కాలక్రమేణా దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగుదారులు కౌలు చెల్లించడం మానేశారు. అంతేకాక పలువురు సాగుదారులు.. దేవదాయ శాఖ భూములను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. మరోవైపు ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు నిధుల కొరత ఏర్పడింది. కాగా మాడుగుల ప్రాంతంలోని దేవదాయ శాఖ భూముల్లో సుమారు 200 ఎకరాలను 2015-17 సంవత్సరాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో వంద ఎకరాలను వేలం పాట ద్వారా రైతులు కౌలుకు తీసుకుని, ఏటా నిర్ణీత మొత్తం కౌలు చెల్లిస్తున్నారు. మిగిలిన 740 ఎకరాలు పరాధీనంలో వున్నట్టు దేవదాయ శాఖ అధికారులు గుర్తించారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో 2014లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఆలయాల భూములను గుర్తించిన రెవెన్యూ అధికారులు వాటికి 1-బి పత్రాలను జారీ చేశారు. ఈ భూములను వేలం పాట ద్వారా కౌలుకు ఇవ్వడానికి అధికారులు చర్యలు చేపట్టగా, అప్పటికే సాగు చేసుకుంటున్న రైతులు అడ్డుపడి, ఈ భూములు ఆలయాలకు చెందినవి కావని, తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దేవదాయ శాఖ భూములను గుర్తించి బోర్డులు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతల అండదండలతో దేవదాయ భూముల ఆక్రమణదారులు తమ పేరున పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి, మాడుగులలో సమగ్ర భూ సర్వే నిర్వహించి, దేవదాయ శాఖ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.

200 ఎకరాలకు అక్రమంగా పాస్‌పుస్తకాలు జారీ

టీఎన్‌ఎస్‌ శర్మ, దేవదాయ శాఖ అధికారి, మాడుగుల

మాడుగులలో ఎనిమిది దేవాలయాలకు సంబంధిచి వెయ్యి ఎకరాలపైబడి మాన్యం భూములు వున్నాయి. ఇందులో 200 ఎకరాలకు సంబంఽదించి కొంతమంది సాగుదారులు తమ పేరున పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయించుకున్నారు. దీనిపై తహశీల్దారుకు ఫిర్యాదు చేశాం. ఆర్‌వోఆర్‌లో అప్పీలు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Aug 27 , 2025 | 12:52 AM