వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా తేజ్ భరత్
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:25 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విజయవాడలో పనిచేస్తున్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న విశ్వనాథన్‌ను గత నెల తొమ్మిదో తేదీన ఐ అండ్ పీఆర్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విజయవాడలో పనిచేస్తున్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న విశ్వనాథన్‌ను గత నెల తొమ్మిదో తేదీన ఐ అండ్ పీఆర్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖ కలెక్టర్ హరేంధిరప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి తరచూ వెళుతున్నా పెట్టుబడుల సదస్సు కారణంగా వీఎంఆర్‌డీఏపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేలోగా ఏడు మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించే బాధ్యతను ప్రభుత్వం వీఎంఆర్‌డీఏకు అప్పగించింది. విశ్వనాథన్ వెళ్లిన తరువాత ఆ పనుల్లో పెద్దగా పురోగతి లేకుండా పోయింది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయి అధికారిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నగరంలో ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు జరగనున్న ఉన్న నేపథ్యంలో తేజ్ భరత్ వెంటనే విధుల్లో చేరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం వచ్చేసరికి ఆయన ఇక్కడ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.