Share News

జోనల్‌స్థాయి హాకీ పోటీలకు జట్ల ఎంపిక

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:14 PM

స్థానిక హాకీ మైదానంలో సోమవారం జిల్లా స్థాయి బాలుర, బాలికల హాకీ జట్ల ఎంపిక జరిగింది. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాజట్ల ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారితో నాలుగు జిల్లాస్థాయి జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి ఎల్‌వీ రమణ చెప్పారు.

జోనల్‌స్థాయి హాకీ పోటీలకు జట్ల ఎంపిక
జోనల్‌స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన బాలుర, బాలికల జట్టు

నక్కపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక హాకీ మైదానంలో సోమవారం జిల్లా స్థాయి బాలుర, బాలికల హాకీ జట్ల ఎంపిక జరిగింది. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాజట్ల ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారితో నాలుగు జిల్లాస్థాయి జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారి ఎల్‌వీ రమణ చెప్పారు. నక్కపల్లి, ఎలమంచిలి ప్రాంతాల నుంచి ఒక్కొక్క జట్టులో ఎనిమిది మంది చొప్పున క్రీడాకారులు వుంటారని చెప్పారు. వీరు త్వరలో విశాఖలో జరగనున్న జోనల్‌ స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ ప్రతిభ చూపిన వారితో రాష్ట్రస్థాయి పోటీలకు తుది జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, అధ్యక్షుడు చిన్న అప్పారావు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ,జాతీయ సీనియర్‌ క్రీడాకారుడు రామచంద్రరావు, హెచ్‌ఎం విజయ, కోచ్‌ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:14 PM