ముగిసిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:45 AM
ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. క్రికెట్ పోటీల్లో పాడేరు డివిజన్ ఉపాధ్యాయులు విజేతగా, రంపచోడవరం డివిజన్ ఉపాధ్యాయులు రన్నర్స్‌గా నిలిచారు.
క్రికెట్‌లో పాడేరు, త్రోబాల్‌లో రంపచోడవరం జట్లు విజేతలు
పాడేరురూరల్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. క్రికెట్ పోటీల్లో పాడేరు డివిజన్ ఉపాధ్యాయులు విజేతగా, రంపచోడవరం డివిజన్ ఉపాధ్యాయులు రన్నర్స్‌గా నిలిచారు. మహిళా ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రోబాల్ పోటీల్లో రంపచోడవరం టీచర్లు విజేతగా నిలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా, పాడేరు మహిళా ఉపాధ్యాయులు రన్నర్స్‌గా నిలిచారు. జిల్లా జట్టులోని ప్రతిభావంతులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ పాంగి సూరిబాబు తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు డీఈవో డాక్టర్.కె.రామకృష్ణారావు బహుమతులను ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి అల్లూరి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి వి.కొండబాబు, పీఈటీ, పీడీల అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ భూపతిరాజు, హెచ్‌ఎం ఎస్.విశ్వప్రసాద్, సత్యవతి, రాజులమ్మ పాల్గొన్నారు.