సంస్థాగత ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:51 AM
జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది.మూడు పర్యాయాలు, లేదా వరుసగా ఆరేళ్లపాటు పదవులు నిర్వహించిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రెగ్యులర్ అబ్జర్వర్ ఒకరు, ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించింది.
మండల, నియోజకవర్గం, జిల్లా కమిటీల నియామకానికి ఏర్పాట్లు
మూడు పర్యాయాలు లేదా వరుసగా ఆరేళ్లపాటు పదవులు నిర్వహించిన వారికి నో ఛాన్స్
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకుల నియామకం
నర్సీపట్నం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది.మూడు పర్యాయాలు, లేదా వరుసగా ఆరేళ్లపాటు పదవులు నిర్వహించిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రెగ్యులర్ అబ్జర్వర్ ఒకరు, ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించింది. చోడవరం నియోజకవర్గానికి రెగ్యులర్ అబ్జర్వర్‌గా గొంప కృష్ణ, ఎలక్షన్ అబ్జర్వర్లుగా మాదంశెట్టి నీలబాబు, వేగి పరమేశ్వరరావు, మాడుగులకు రెగ్యులర్ అబ్జర్వర్‌గా వాసిరెడ్డి యేసుబాబు, ఎలక్షన్ అబ్జర్వర్లుగా కోండ్రు మరిడయ్య, బొడ్డేడ నాగ గంగాధర్, అనకాపల్లికి రెగ్యులర్ అబ్జర్వర్‌గా గంటా నూకరాజు, ఎలక్షన్ అబ్జర్వర్లుగా దాసరి శ్రీనివాస్, డొక్కా నాగభూషణం నియమితులయ్యారు. పెందుర్తి నియోజకవర్గానికి రెగ్యులర్ అబ్జర్వర్‌గా కోరాడ రాజబాబు, ఎలక్షన్ అబ్జర్వర్లుగా బీమరశెట్టి శ్రీనివాసరావు, రొంగలి మహేశ్, ఎలమంచలికి రెగ్యులర్ అబ్జర్వర్‌గా బొండా జగన్నాథం, ఎలక్షన్ అబ్జర్వర్లుగా ఆళ్ల మంగరాజు, బొడ్డేడ శ్రీనివాసరావు, పాయకరావుపేటకు రెగ్యులర్ అబ్జర్వర్‌గా చప్పిడి వెంకటేశ్వరరావు, ఎలక్షన్ అబ్జర్వర్లుగా పుల్లేటికుర్తి అప్పలరమేశ్, మళ్ల గణేశ్‌కుమార్, నర్సీపట్నానికి రెగ్యులర్ అబ్జర్వర్‌గా పీలా శ్రీనివాసరావు, ఎలక్షన్ అబ్జర్వర్లుగా బొర్రా నాగరాజు, కొట్టగుళ్లి సుబ్బారావు నియమితులయ్యారు.