టీడీపీ నేత స్రవంతికి నామినేటెడ్ పదవి
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:43 AM
మునగపాకకు చెందిన టీడీపీ మహిళా నేత బీలా స్రవంతికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఆమెను శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం
మునగపాక, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): మునగపాకకు చెందిన టీడీపీ మహిళా నేత బీలా స్రవంతికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఆమెను శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునగపాక దళిత కాలనీకి చెందిన స్రవంతి 2016 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా, అనకాపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆమె భర్త లక్ష్మణరావు జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.