రైలు ఢీకొని టీడీపీ నాయకుడి మృతి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:34 PM
మండలంలోని సీతారాంపురంలో సోమవారం రైలు ఢీకొని టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పక్కుర్తి మాధవరావు(58) మృతిచెందాడు. ఇందుకు సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
పాయకరావుపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సీతారాంపురంలో సోమవారం రైలు ఢీకొని టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పక్కుర్తి మాధవరావు(58) మృతిచెందాడు. ఇందుకు సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన మాధవరావు సోమవారం ఉదయం మేకలను మేతకు తోలుకెళుతున్నాడు. ఈ క్రమంలో రైలు పట్టాలపైకి వెళ్లిన మేకలను పక్కకు తోలేందుకు వెళ్లాడు. అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తుని రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాన్నట్టు ఎస్‌ఐ తెలిపారు.