Share News

పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ

ABN , Publish Date - May 27 , 2025 | 11:24 PM

పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలన్నదే పార్టీ నినాదమన్నారు.

పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ
టీడీపీ జెండాతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

కూడు, గుడ్డ, నీడ కల్పించాలన్నదే పార్టీ నినాదం

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలన్నదే పార్టీ నినాదమన్నారు. మంగళవారం నర్సీపట్నం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఎన్టీరామారావు జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎన్టీరామారావు రాష్ర్టాభివృద్ధి కోసం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. పేదలకు కిలో రూ.2 బియ్యం పథకం, తండ్రి ఆస్తిలో కూతురికి ఆస్తి హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌లాంటి మహానటుడు దేశంలోని ఏ సినిమా పరిశ్రమలో లేరని అన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:24 PM