టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ నియామకం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:48 AM
తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావులను ఇటీవల ప్రకటించిన అధిష్ఠానం, బుధవారం మిగతా కమిటీని ప్రకటించింది.
ఉపాధ్యక్షులుగా జ్ఞానేశ్వరి, అప్పారావు
అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం
పాడేరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.తేజోవతి, దత్తి లక్ష్మణరావులను ఇటీవల ప్రకటించిన అధిష్ఠానం, బుధవారం మిగతా కమిటీని ప్రకటించింది. చింతపల్లికి చెందిన సీనియర్ మహిళా నేత చల్లంగి జ్ఞానేశ్వరి, అరకులోయకు చెందిన జన్ని అప్పారావు, పాంగి రవీంద్రలకు ఉపాధ్యక్షులుగా స్థానం కల్పించింది. అలాగే ఎ.బాపిరాజు; కె.బాపన్నదొర(రంపచోడవరం), బి.రామ్మోహనరావు(పార్వతీపురం), జి.అప్పారావు(సాలూరు), డి.రామారావునాయుడు(కురుపాం), కె.రవీంద్రపాత్రుడు(పాలకొండ)లను ఉపాధ్యక్షులుగా నియమించింది.
పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వై.రత్నకుమారి, కె.లోవమ్మ(రంపచోడవరం), గంగపూజారి శివకుమార్(పాడేరు), పాంగి కామేశ్వరరావు(అరకులోయ), జొన్నాడ తేరేజమ్మ, బలగ మధుసూదనరావు(పార్వతీపురం), పిన్నింటి ఈశ్వరరావు(సాలూరు), బాలసింగి నాగేశ్వరరావు(కురుపాం), కొండగొర్రి జనయ్య(పాలకొండ) నియమితులయ్యారు.
పార్లమెంట్ అధికార ప్రతినిధులుగా మడకం పోసమ్మ(రంపచోడవరం), కొర్రు రామమూర్తి, గబ్బాడ కుమారి(పాడేరు), గెమ్మెలి భీమాలమ్మ, పాంగి రాధిక(అరకులోయ), రెడ్డి శ్రీనివాసరావు(పార్వతీపురం), గొర్లె ముసలినాయుడు(సాలూరు), అప్పలకొండ(కురుపాం), గంటా సంతోశ్‌కుమార్(పాలకొండ) నియమితులయ్యారు.
పార్లమెంట్ కార్యదర్శులుగా రోలపల్లి రాంబాబు, కొమరం మల్లేశ్వరరావు(రంపచోడవరం), గెమ్మెలి రామారావు(పాడేరు), కె.బొంజుబాబు(పాడేరు), జి.రవికుమార్(పార్వతీపురం), బి.రామన్నదొర(సాలూరు), టి.రామారావు, నిమ్మల నీలకంఠేశ్వరరావు(కురుపాం), జయలక్ష్మి(పాలకొండ), పార్లమెంట్ కోశాధికారిగా మజ్జి అప్పారావు(పార్వతీపురం), పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీగా ఎ.రాధ(సాలూరు), పార్లమెంట్ మీడియా సమన్వయకర్తగా కూడి రామునాయుడు(పాడేరు), పార్లమెంట్ సోషల్ మీడియా సమన్వయకర్తగా జి.సోమేశ్వరరావు(పాడేరు)లను నియమిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. అరకులోయ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న పాడేరు, అరకులోయ, రంపచోడవరం, సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు ప్రాధాన్యం కల్పిస్తూ కమిటీని నియమించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.