చెరకు రసంతో తాండ్ర
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:17 AM
మామిడి, తాటి పండ్ల రసంతో తయారు చేసిన తాండ్రలనే ఇంతవరకు చూసి వుంటాం. కానీ అనకాపల్లి వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వినూత్న రీతిలో చెరకు రసం నుంచి తాండ్రను తయారు చేశారు. మామిడి, ఇతర తాండ్రలతో పోలిస్తే చెరకు రసంతో తయారు చేసిన తాండ్ర చాలా రుచిగా వుంటుందని, రైతులు సొంతంగా దీనిని తయారు చేసుకుని, మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా గురువారం చెరకు తాండ్రను తయారు చేశారు. చెరకు తాండ్ర తయారీ గురించి వారు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ విద్యార్థుల వినూత్న ప్రయోగం
ప్రాజెక్టు వర్కులో భాగంగా తయారీ
తాండ్ర తయారీతో రైతులకు అదనపు ఆదాయం
అనకాపల్లి అగ్రికల్చర్, డిసెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): మామిడి, తాటి పండ్ల రసంతో తయారు చేసిన తాండ్రలనే ఇంతవరకు చూసి వుంటాం. కానీ అనకాపల్లి వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వినూత్న రీతిలో చెరకు రసం నుంచి తాండ్రను తయారు చేశారు. మామిడి, ఇతర తాండ్రలతో పోలిస్తే చెరకు రసంతో తయారు చేసిన తాండ్ర చాలా రుచిగా వుంటుందని, రైతులు సొంతంగా దీనిని తయారు చేసుకుని, మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా గురువారం చెరకు తాండ్రను తయారు చేశారు. చెరకు తాండ్ర తయారీ గురించి వారు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
శుద్ధిచేసిన చెరకు రసాన్ని 30 నిమిషాలసేపు మరిగించి దీనికి సరిపడ మోతాదులో పెక్టిన్ (పండ్లను మగ్గబెట్టడానికి వినియోగించే పదార్థం) కలపాలి. తర్వాత మరో నాలుగు నిమిషాలపాటు మిశ్రమాన్ని మరిగించాలి. కాస్త దగ్గరపడిన తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన వెడల్పాటి పళ్లెంలో సమంగా పరవాలి. 30 నిమిషాల తరువాత మరలా ఇలాంటి మిశ్రమాన్నే తయారుచేసి దీనిపై పరచాలి. ఈ మిశ్రమాలను పొరలు పొరలుగా ఒకదానిపై ఒకటి పరిచి రెండు, మూడు గటలసేపు ఆరనివ్వాలి. తర్వాత కావాల్సిన సైజుల్లో ముక్కలుగా కోసి ప్యాక్ చేసుకోవాలి. సువాసనల కోసం నిమ్మ, యాలకల పొడి, అల్లం ఫ్లేవర్స్‌ను కలుపుకోవచ్చు. విద్యార్థినులు దీప్తి, గౌతమ్, దేవి, భవ్యశ్రీ, దుర్గసిరి, శ్రావణి, ధనలక్ష్మి, రమ్య ఈ ప్రాజెక్టు వర్కులో పాల్గొన్నారు. పోస్టు హార్వెస్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాఽథరావు, టీచింగ్ అసోసియేట్ డాక్టర్ నాగేశ్వర్, ఇంజనీర్ డాక్టర్ ముజామిల్‌ఖాన్, టీచింగ్ అసిస్టెంట్ వసంత సాయికుమారి పర్యవేక్షించారు.