Share News

జనవరి 28న టీ20 మ్యాచ్‌

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:32 AM

పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు రంగం సిద్ధమవుతోంది.

జనవరి 28న టీ20 మ్యాచ్‌

ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నిర్వహణ

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న వుమెన్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఆతిఽథ్యమిచ్చేందుకు సమాయత్తమవుతున్న విశాఖ... వచ్చే ఏడాది ప్రారంభంలో కూడా మరో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. జనవరి 28న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం కానున్నది. న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ పర్యటనలో భాగంగా భారత్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనున్నది. ఇందుకు సంబంధించిన మ్యాచ్‌ల తేదీలు, వేదికల షెడ్యూల్‌ను భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. ఐదు టీ20 సిరీస్‌కు సంబంధించి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు (ఏసీఏ) ఒక మ్యాచ్‌ను కేటాయిస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జనవరి 28న జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానున్నది. దీంతో ఇప్పటి వరకు మూడు టెస్టు మ్యాచ్‌లు, పది వన్డే మ్యాచ్‌లు, నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన విశాఖ... త్వరలో ఐదో టీ20 మ్యాచ్‌ నిర్వహణకు సిద్ధమవుతోంది.


నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

విశాఖపట్నం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్‌, జీవీఎంసీ, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్టు ఆయా శాఖల అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, సీపీ శంఖబ్రత బాగ్చితో పాటు జీవీఎంసీ అధికారులంతా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశారు.

Updated Date - Jun 16 , 2025 | 12:32 AM