స్వస్థ్ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:52 PM
మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్వస్థ్ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు సూచించారు.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
డీఎంహెచ్‌వో డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు
పాడేరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్వస్థ్ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు సూచించారు. పాడేరులోని గుడివాడ వీధి అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో బుధవారం స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బుధవారం నుంచి పక్షం రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో స్వస్త్ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తారన్నారు. ఆయా వైద్య శిబిరాల్లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం, నోటి, గర్భాశయ క్యానర్స్ వంటి వాటికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తదుపరి వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో మహిళలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్వస్థ్ నారీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి బి.కమలాకరరావు, వైద్యులు బీవీ శ్రీలక్ష్మి, అఖిల్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణమ్మ, సమన్వయకర్త ప్రసన్నదత్తు, ఆరోగ్య విస్తరణాధికారి జి.సింహాద్రి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.