అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలపై సస్పెన్స్.!
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:25 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుల ఎంపికకు నిర్వహించే ఇంట ర్వ్యూలపై సస్పెన్స్ కొనసాగుతోంది.
దరఖాస్తు చేసుకున్న వారికి కాల్ లెటర్స్ పంపించిన అధికారులు
ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలకు అందని సమాచారం
విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుల ఎంపికకు నిర్వహించే ఇంట ర్వ్యూలపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ప్రస్తుతం వర్సిటీలో జోరుగా చర్చ సాగుతోంది. అతిథి అధ్యాపకులుగా పనిచేసే వారిని ఎంపిక చేసేం దుకు వచ్చే నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కాల్ లెట ర్స్ పంపించారు.
గతంలో ఆరుగురి సభ్యులతో కూడిన కమి టీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్, విభాగాధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, సబ్జెక్ట్‌కు చెందిన నిపుణుడు, ఇద్దరు ఈసీ మెంబర్స్‌తో కూడిన కమిటీ ఆధర్వ్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించా రు. ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తారా.? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు కాలేజీ ప్రిన్సిపాల్స్, హెచ్‌వోడీలకు ఉన్న తాధికారుల నుంచి సమాచారం అందలేదు. దీంతో ఇంటర్వ్యూల నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా నిర్వహించే ఉద్దేశం ఉంటే ఉన్న తాధికారులు బోర్డు సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నలు ఉత్ప న్నమవుతున్నాయి. సమయం ఉన్నందున ఒకటి, రెండు రోజుల్లో కమిటీ సభ్యులకు సమాచారం ఇస్తారని పలువురు పేర్కొంటున్నారు.