సర్వే రాళ్లు వీఆర్వోకి అప్పగింత
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:25 AM
‘ప్రజాధనం రాళ్లపాలు’ పేరిట ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన అధికారులు
చోడవరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):
‘ప్రజాధనం రాళ్లపాలు’ పేరిట ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అనకాపల్లి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ వెంకన ్న ఆదేశాల మేరకు లక్కవరంలో వృఽథాగా పడి ఉన్న సర్వే రాళ్లను సర్వే సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకారంతో లాటుగా పేర్పించి స్థానిక వీఆర్వోకు అప్పగించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, ఇతర గ్రామాలకు పంపించవలసిన సర్వే రాళ్లను సిబ్బంది ఇక్కడ నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పారు.