Share News

తాడి తరలింపునకు సర్వే ప్రారంభం

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:17 AM

ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామం తరలింపునకు రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సర్వే కోసం ముగ్గురు అధికారులతో కూడిన ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. తాడి బీసీ కాలనీ, చినతాడి, పెదతాడి గ్రామాల్లో ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపడతాయని తహసీల్దార్‌ ఎస్‌వీ అంబేడ్కర్‌ తెలిపారు. సర్వే పారదర్శకంగా జరుపుతామన్నారు. వారం నుంచి పది రోజుల్లోగా సర్వేను పూర్తి చేస్తామన్నారు. ఎన్ని ఇళ్లు, మేజర్‌ సన్స్‌, మేజర్‌ డాటర్స్‌ వంటి విషయాలను సర్వేలో ప్రధానాంశాలుగా తీసుకున్నారు.

తాడి తరలింపునకు సర్వే ప్రారంభం
ఇంటింటా సర్వే చేపడుతున్న అధికారులు

- ఎనిమిది బృందాలతో ఇంటింటా సర్వే

- పారదర్శకంగా నిర్వహించి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తాం

- తహసీల్దార్‌ అంబేడ్కర్‌

పరవాడ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామం తరలింపునకు రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సర్వే కోసం ముగ్గురు అధికారులతో కూడిన ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. తాడి బీసీ కాలనీ, చినతాడి, పెదతాడి గ్రామాల్లో ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపడతాయని తహసీల్దార్‌ ఎస్‌వీ అంబేడ్కర్‌ తెలిపారు. సర్వే పారదర్శకంగా జరుపుతామన్నారు. వారం నుంచి పది రోజుల్లోగా సర్వేను పూర్తి చేస్తామన్నారు. ఎన్ని ఇళ్లు, మేజర్‌ సన్స్‌, మేజర్‌ డాటర్స్‌ వంటి విషయాలను సర్వేలో ప్రధానాంశాలుగా తీసుకున్నారు. కాగా సర్వే ప్రారంభానికి ముందు తాడి బీసీ కాలనీలో జనసేన మండల ఇన్‌చార్జి పంచకర్ల ప్రసాద్‌ తహసీల్దార్‌ సమక్షంలో గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించారు. సర్వేలో బినామీ పేర్లు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. సర్వేకు గ్రామస్థులంతా సహకరించాలన్నారు. సర్వే పూర్తయిన వెంటనే నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తహసీల్దార్‌ వెల్లడించారు. సోమవారం నుంచి సర్వే పూర్తిస్థాయిలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొడ్డపల్లి అప్పారావు, గనిరెడ్డి కనకారావు, కోమటి సూరిబాబు, బుగిడి రామగోవిందరావు, జుత్తుక మాధవరావు, పైలా కృష్ణారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:17 AM