Share News

మద్యానికి బానిసైన యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - May 11 , 2025 | 12:00 AM

మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం ప్రధాన రహదారికి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మద్యానికి బానిసైన యువకుడి ఆత్మహత్య
మృతుడు రెడ్డి ప్రవీణ్‌కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

గోపాలపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం ప్రధాన రహదారికి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇక్కడి నూకాలమ్మ ఆలయ సమీపంలో రెడ్డి పార్వతి అనే మహిళ కుమారుడు రెడ్డి ప్రవీణ్‌కుమార్‌తో పాటు కలిసి ఉంటుంది. పెయింటింగ్‌ పనులు చేసే ప్రవీణ్‌కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. కాగా కొద్ది రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రవీణ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనికి వెళ్లిన పార్వతి రాత్రి ఇంటికి వచ్చేసరికి కుమారుడు ఉరి వేసుకున్నట్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 11 , 2025 | 12:00 AM