సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్ బదిలీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:32 PM
స్థానిక సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియామకం
పాడేరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శౌర్యమన్ పటేల్ శిక్షణ పూర్తయిన తరువాత స్థానిక సబ్‌కలెక్టర్‌గా 2024 సెప్టెంబరులో నియమించింది. దీంతో ఆయన గతేడాది కాలంగా స్థానిక సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.