పకడ్బందీగా రీ సర్వే
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:37 AM
రాష్ట్రంలో రెండో విడత జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రీ సర్వే డిప్యూటీ డైరెక్టర్(అమరావతి) కె.రమణమూర్తి ఆదేశించారు. మండలంలోని ఆరిపాక గ్రామంలో శనివారం జరిగిన రీ సర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అదపురెడ్డి పైడింనాయుడు అనే రైతుకు సంబంధించిన సర్వే కొలతలను మరోసారి ఆయన తీయించారు.
- భూమి ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించాలి
- అధికారులకు రీ సర్వే డిప్యూటీ డైరెక్టర్ కె.రమణమూర్తి ఆదేశం
సబ్బవరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రీ సర్వే డిప్యూటీ డైరెక్టర్(అమరావతి) కె.రమణమూర్తి ఆదేశించారు. మండలంలోని ఆరిపాక గ్రామంలో శనివారం జరిగిన రీ సర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అదపురెడ్డి పైడింనాయుడు అనే రైతుకు సంబంధించిన సర్వే కొలతలను మరోసారి ఆయన తీయించారు. సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేకు ముందు అధికారులు సమాచారం ఇచ్చారా?, నోటీసులు ఇచ్చారా? అని అడగ్గా, సమాచారం ఇచ్చే సర్వే చేపట్టారని రైతులు సమాధానమిచ్చారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ప్రతి గ్రామానికి సరిపడా సమయం ఇస్తున్నందున, గతంలో వలే ఎటువంటి ఒత్తిడి లేనందున తప్పులు దొర్లకుండా రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా రికార్డులు తీర్చిదిద్దాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్నవి వదిలిపెట్టి, కోర్టు పరిధిలో లేని వివాదాలకు సంబంధించి ఇరువర్గాలతో మాట్లాడి సాధ్యమైనంత వరకూ పరిష్కరించాలని సూచించారు. మండల, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఎస్. గోపాలరాజు, జిల్లా ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకన్న, తహశీల్దార్ బి. చిన్నికృష్ణ, మండల సర్వేయర్ ఎల్.అప్పారావు, మండల ఆర్‌ఐ వీరయ్య, సర్వేయర్లు లోకేశ్, వీఆర్వో అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.