రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:31 PM
రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని గూడెంకొత్తవీధి ఎస్‌ఐ కె.సురేశ్ హెచ్చరించారు. సోమవారం పెదవలస అటవీ రేంజ్ పరిధిలో ఉన్న సిగినాపల్లి రంగురాళ్ల క్వారీని అటవీ, రెవెన్యూ శాఖ ఉద్యోగులతో కలిసి ఆయన పరిశీలించారు.
వ్యాపారులు, కూలీలపై ప్రత్యేక నిఘా
ఎస్‌ఐ సురేశ్
చింతపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని గూడెంకొత్తవీధి ఎస్‌ఐ కె.సురేశ్ హెచ్చరించారు. సోమవారం పెదవలస అటవీ రేంజ్ పరిధిలో ఉన్న సిగినాపల్లి రంగురాళ్ల క్వారీని అటవీ, రెవెన్యూ శాఖ ఉద్యోగులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీలో మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నించారన్నారు. గతంలో ఈ క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు జరుపుతూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారన్నారు. అప్పటి నుంచి ఈ క్వారీని పూర్తిగా నిషేధించినట్టు చెప్పారు. ప్రస్తుతం రంగురాళ్ల వ్యాపారులు, కూలీల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్వారీ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఎవరు సంచరించినా చర్యలు తప్పవన్నారు. రంగురాళ్ల తవ్వకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు సహకరించినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌వో పి.నూకరాజు, ఎఫ్‌బీవో బి. గోపి, దామనాపల్లి, సంకాడ వీఆర్వోలు కె.వరప్రసాద్, కె.రామారావు ఉన్నారు.