అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:43 PM
టువంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్‌లు, నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు.
అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్‌లు, నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగం, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఐటీడీఏ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు, డిప్యూటీ ఎంపీడీవోలు ల్యాండ్ కన్వర్షన్, లేఅవుట్‌లు, భవన నిర్మాణాల అనుమతులపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నిబంధనల మేరకు లేఅవుట్‌లు, ఇళ్ల, వాణిజ్య నిర్మాణాలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో టౌన్‌ప్లానింగ్ ఆర్‌డీ చామంతి, ఏడీ శ్రావణి, డీటీసీ పీవో రామునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్ కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీల కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.