స్టీల్‌ప్లాంట్‌తో వేలాది మందికి ఉపాధి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:47 PM
నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ వల్ల పాయకరావుపేట నియోజకవర్గానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూటమి నాయకులు చెప్పారు.
‘పేటకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది
కూటమి నేతలు వెల్లడి
నక్కపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ వల్ల పాయకరావుపేట నియోజకవర్గానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూటమి నాయకులు చెప్పారు. నక్కపల్లికి స్టీల్‌ప్లాంట్ మంజూరుపట్ల మంగళవారం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ విషయంలోప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూటమి శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోట నగేశ్, కొప్పిశెట్టి వెంకటేశ్, చించలపు పద్దు, కొప్పిశెట్టి కొండబాబు, అమలకంటి అబద్దం, గింజాల లక్ష్మణరావు, కొప్పిశెట్టి బుజ్జి, కురందాసు నూకరాజు, పెద్దిరెడ్డి శ్రీను, దేవర సత్యనారాయణ, కోసూరి శ్రీను, వైబోయిన రమణ, వెలగా శ్రీను, మేరుగు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.