గంజాయికి దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:15 AM
గంజాయి సాగు, వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గంజాయి వద్దు బ్రో పేరిట ఎస్‌పీ అమిత్‌బర్ధార్ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ జె ండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేసేందుకు ఒక యుద్ధమే చేశామని, ఫలితంగా గతంలో పది వేల ఎకరాల్లో ఉండే గంజాయి పంట నేడు పది సెంట్ల విస్తీర్ణంలో సైతం లేదన్నారు.
- కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ పిలుపు
- పాడేరులో గంజాయి వ్యతిరేక సైకిల్ ర్యాలీ
పాడేరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు, వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గంజాయి వద్దు బ్రో పేరిట ఎస్‌పీ అమిత్‌బర్ధార్ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ జె ండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేసేందుకు ఒక యుద్ధమే చేశామని, ఫలితంగా గతంలో పది వేల ఎకరాల్లో ఉండే గంజాయి పంట నేడు పది సెంట్ల విస్తీర్ణంలో సైతం లేదన్నారు. పోలీసు, ఈగల్ బృందం, వివిధ ప్రభుత్వ శాఖ సమన్వయంతో గంజాయి సాగు, రవాణాకు సంపూర్ణంగా అడ్డుకట్ట వేశామన్నారు. అయినప్పటికీ సరిహద్దు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా జరుగుతున్నదని, దానికి పోలీసులు ప్రత్యేక చర్యలతో అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకుని, తమ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్ధార్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు బానిసకావద్దని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈగల్ బృందం రూపొందించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ డి.దీనబందు, ఎస్‌ఐ ఎల్.సురేశ్, ఈగల్ బృందం ఇన్‌స్పెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.