మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:41 PM
జీవితానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపు
పాడేరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జీవితానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ’నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మద్యపానం, గంజాయి, ధూమపానం వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాల నియంత్రణ కేవలం ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుందని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతదేవి మాట్లాడుతూ ప్రధానంగా యువత మత్తు పదార్థాలు, చెడు మార్గాల వైపు వెళ్లకూడదన్నారు. మత్తుతో జీవితాలు చిత్తవుతాయన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది, వైద్య విద్యార్థులు, తదితరులు ర్యాలీలో పాల్గొని అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తినాయక్, జనరల్ మెడికల్ హెచ్‌వోడీ డాక్టర్ సురేశ్వరరెడ్డి, ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింగరావు, వైద్యులు, ఈగల్ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.