రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:01 AM
వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని పరవాడ మండలం సాలాపువానిపాలెం (జీవీఎంసీ 84వ వార్డు పరిధి)లో సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.
లంకెలపాలెం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని పరవాడ మండలం సాలాపువానిపాలెం (జీవీఎంసీ 84వ వార్డు పరిధి)లో సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. జనసేన నేత దుల్ల రామునాయుడు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం తూర్పుగోదావరి, విశాఖ జిల్లా గంగవరం ఏజే వారియర్స్ జట్ల మధ్య హోరాహోరా పోటీ సాగింది. ఈ పోటీలో తూర్పుగోదావరి జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మాదంశెట్టి నీలబాబు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు సాలాపు మోహన్‌రావు, సాలాపు శ్రీనివాసరావు, వెంకటఅప్పారావు, సుమన్‌అప్పారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి ఉరుకూటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.