Share News

సూపర్‌ బజార్‌ ఎండీగా శ్రీరామమూర్తి

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:43 AM

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ (సూపర్‌ బజార్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పి.శ్రీరామమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్వతీపురం జిల్లా సహకారశాఖ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు.

సూపర్‌ బజార్‌ ఎండీగా శ్రీరామమూర్తి
సూపర్‌ బజార్‌ ఎండీ శ్రీరామమూర్తి

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ (సూపర్‌ బజార్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పి.శ్రీరామమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్వతీపురం జిల్లా సహకారశాఖ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. రెండు నెలల క్రితమే బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటికి సాంకేతిక పరమైన కారణాలతో సూపర్‌ బజార్‌ ఎండీ బాధ్యతల స్వీకరణలో జాప్యం జరిగింది. ఇక్కడ ఎండీగా పనిచేసిన శ్రీనివాసరాజును ప్రభుత్వం బదిలీ చేయడంతో ఇన్‌చార్జి ఎండీగా జిల్లా సహకార శాఖ అధికారి టి. ప్రవీణ వ్యవహరించారు. ఇప్పుడు శ్రీరామమూర్తి సూపర్‌బజార్‌ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థను లాభాల బాటలో నడిపించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో సూపర్‌ బజారుకు పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:43 AM