నేడు ఐటీడీఏ పీవోగా శ్రీపూజ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:50 PM
స్థానిక ఐటీడీఏ పీవోగా తిరుమని శ్రీపూజ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమని శ్రీపూజను స్థానిక ఐటీడీఏ పీవోగా ఈ నెల 3న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం ఐటీడీఏ పీవో హోదాలో ఢిల్లీలో రాష్ట్రపతితో జరిగే భేటీకి పయనం
పాడేరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ పీవోగా తిరుమని శ్రీపూజ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమని శ్రీపూజను స్థానిక ఐటీడీఏ పీవోగా ఈ నెల 3న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న వి.అభిషేక్‌ను ఈ ఏడాది జనవరిలో పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారిగా బదిలీ చేయడంతో అప్పటి నుంచి ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో స్థానిక జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్‌గౌడకు ఐటీడీఏ పీవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా శ్రీపూజను నియమించడంతో ఆమె ఆదివారం సాయంత్రమే పాడేరు చేరుకున్నారు. సోమవారం ఉదయం స్థానిక మోదకొండమ్మను దర్శించుకుని, అనంతరం జేసీ అభిషేక్‌గౌడ నుంచి ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా గిరిజన ప్రాంతాల్లో పని చేసే ఐఏఎస్ అధికారులతో ఢిల్లీలో రాష్ట్రపతితో జరిగే భేటీలో పాల్గొనేందుకు ఆమె పయనమవుతారు. మూడు రోజుల తరువాత ఆమె మళ్లీ తిరిగి పాడేరు చేరుకుంటారు.