ఆలిండియా కబడ్డీ పోటీలకు ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా శ్రీనివాసులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:51 AM
దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు నిర్వహించే 47వ ఆలిండియా ఎలక్ట్రిసిటీ కబడ్డీ పోటీలకు ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా సీలేరుకు చెందిన ఏపీ జెన్‌కో ఏడీఈ కె.శ్రీనివాసులు ఎంపికయ్యారు.
సీలేరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు నిర్వహించే 47వ ఆలిండియా ఎలక్ట్రిసిటీ కబడ్డీ పోటీలకు ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా సీలేరుకు చెందిన ఏపీ జెన్‌కో ఏడీఈ కె.శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారి టీడీ కుమార వడివేలు ప్రకటించారు. ఇటీవల ఏపీ జెన్‌కో రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ పోటీలు సీలేరులో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతిభ చూపిన వివిధ ప్రాంతాలకు చెందిన 13 మందిని సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణ యాదగిరిగుట్టలో నిర్వహించే 47వ ఆలిండియా కబడ్డీ పోటీలకు ఆంధ్ర జట్టు తరఫున ఎంపిక చేశారు. ఈ జట్టుకు శ్రీనివాసులును కెప్టెన్‌గా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలిండియా కబడ్డీ పోటీలకు 10 రోజుల ముందు నుంచే విజయవాడలో ప్రాక్టీస్ చేస్తామన్నారు. అధికారులు, క్రీడాకారుల సహకారంతో ఆలిండియా పోటీల్లో సత్తా చాటుతామని చెప్పారు.