Share News

నీట్‌ పీజీ- 2025లో మెరిసిన శ్రీనివాస్‌కుమార్‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:36 AM

నీట్‌ పీజీ- 2025లో మెలుపాక గ్రామానికి చెందిన డాక్టర్‌ గుర్రం శ్రీనివాస్‌కుమార్‌ ప్రతిభ చాటారు. నీట్‌ పీజీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

నీట్‌ పీజీ- 2025లో మెరిసిన శ్రీనివాస్‌కుమార్‌
నీట్‌ పీజీ-2025లో జాతీయ స్థాయిలో ర్యాంక్‌ సాధించిన డాక్టర్‌ శ్రీనివాస్‌కుమార్‌

జాతీయ స్థాయిలో 1,913 ర్యాంక్‌ సాధించిన మెలుపాక డాక్టర్‌

మునగపాక, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పీజీ- 2025లో మెలుపాక గ్రామానికి చెందిన డాక్టర్‌ గుర్రం శ్రీనివాస్‌కుమార్‌ ప్రతిభ చాటారు. నీట్‌ పీజీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. శ్రీనివాస్‌కుమార్‌ 800 మార్కులకు గాను 612 మార్కులతో జాతీయ స్థాయిలో 1,913 ర్యాంక్‌ సాధించారు. ఆయన తాతయ్య సూర్యప్రకాశరావు ఆయుర్వేద వైద్యుడు. తండ్రి శ్రీనివాస్‌ చూచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణాధికారి (ఎంపీహెచ్‌ఈవో)గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్‌కుమార్‌ సోదరి వీర వెంకట శరణ్య విశాఖ ఏఎంసీలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. శ్రీనివాస్‌కుమార్‌ 2018-2023 వరకు శ్రీకాకుళం జెమ్స్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తరువాత హైదరాబాద్‌లో నీట్‌ పీజీ- 2025 అర్హత పరీక్షకు కోచింగ్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో చేరేందుకు అర్హత సాధించానన్నారు. మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన తరువాత సూపర్‌ స్పెషలైజేషన్‌ కూడా చేస్తానని చెప్పారు. ఆ తరువాత న్యూరాలజిస్ట్‌గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 12:36 AM