Share News

ప్రత్యేక రైలు వెలవెల

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:45 AM

దసరా పండుగ రద్దీనిఇ దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రవేశ పెట్టిన ప్రత్యేక రైలుకు స్పందని కొరవడింది. 07059 నంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం అనకాపల్లికి చేరుతుంది. 07060 నంబరుతో ప్రతి మంగళవారం సాయంత్రం అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుతుంది.

ప్రత్యేక రైలు వెలవెల
ఖాళీగా ఉన్న ఏసీ బోగీ

అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో అంతంత మాత్రంగానే ప్రయాణికులు

ఏసీ బోగీలు పూర్తిగా ఖాళీ

ప్రచార లోపంతోపాటు అనకాపల్లి నుంచి నడపడమే కారణమన్న అభిప్రాయం

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దసరా పండుగ రద్దీనిఇ దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రవేశ పెట్టిన ప్రత్యేక రైలుకు స్పందని కొరవడింది. 07059 నంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం అనకాపల్లికి చేరుతుంది. 07060 నంబరుతో ప్రతి మంగళవారం సాయంత్రం అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుతుంది. మంగళవారం ఉదయం 22 బోగీలతో అనకాపల్లి వచ్చిన రైలు, సాయంత్రం 5.35 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరింది. అయితే ఏ బోగీలో కూడా పట్టుమ పది మంది ప్రయాణికులు కూడా లేరు. ఏసీ బోగీలు పూర్తిగా ఖాళీగా కనిపించాయి. సెకండ్‌ క్లాస్‌ జనరల్‌, స్లీపర్‌ కోచ్‌లలో మాత్రమే విజయవాడ వెళ్లే భవానీ మాలధారులు కనిపించారు. ప్రత్యేక రైలు సర్వీసుపై తగిన ప్రచారం చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా విశాఖపట్నం నుంచి కాకుండా అనకాపల్లి నుంచి నడపడం కూడా ఒక కారణమని అంటున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:45 AM