స్త్రీశక్తికి విశేష ఆదరణ
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:24 PM
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ప్రారంభించిన స్త్రీశక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. 15 రోజుల వ్యవధిలో జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం బస్ కాంప్లెక్స్‌ల నుంచి ఐదు లక్షల 63 వేల 514 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారు.
జిల్లాలో 15 రోజుల్లో 5,63,514 మంది మహిళల ఉచిత ప్రయాణం
అనకాపల్లి టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ప్రారంభించిన స్త్రీశక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. 15 రోజుల వ్యవధిలో జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం బస్ కాంప్లెక్స్‌ల నుంచి ఐదు లక్షల 63 వేల 514 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారు. వీరిలో అనకాపల్లి డిపో నుంచి మూడు లక్షల 60 వేల 57 మంది, నర్సీపట్నం కాంప్లెక్స్ నుంచి రెండు లక్షల మూడు వేల 457 మంది మహిళలు ఉన్నారని డీపీటీవో వి. ప్రవీణ తెలిపారు. పథకం ప్రారంభానికి ముందు జిల్లా వ్యాప్తంగా 61 శాతం ఉన్న ఓఆర్ ప్రస్తుతం 90 శాతానికి చేరిందని ఆమె తెలిపారు. శనివారం రావులపాలెం సమీపంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి బస్సు అనకాపల్లి నుంచి బయలుదేరింది. అయితే అనకాపల్లి నుంచి ఒక్కటే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ వాడపల్లికి ఉండడంతో సుమారు 90 మంది వరకు ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం సాగించినట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మహిళలు బస్సు ఎక్కిన వెంటనే ఆధార్ కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ పొందుతున్నారు. ఈ పథకం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.