సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:51 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
పాడేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను తీసుకున్న అనంతరం అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం కూడా మీకోసం అర్జీల స్వీకరణ, పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నదని, ప్రతి అర్జీని పరిష్కరించేందుకు అధికారులు కృషి చే యాలన్నారు.
1100 కాల్ సెంటర్ ఫోన్ చేయాలి
మీకోసంలో అర్జీలు సమర్పించిన ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీకి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకుని, పరిష్కారం పొందాలన్నారు. అలాగే అర్జీలకు సంబంధించిన ఎండార్స్‌మెంటును అర్జీదారులకు రిజిస్టర్ పోస్టులో పంపిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి కలెక్టర్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత 94 వినతులను స్వీకరించారు. ఆయా వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు బట్వాడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, గ్రామసచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ ధర్మరాజు, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృపారావు, తదితరులు పాల్గొన్నారు.