సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - May 31 , 2025 | 01:02 AM
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఆయా వినతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పక్కాగా పరిష్కరించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 4న అరకులోయ మ్యూజియం, రంపచోడవరంల్లో ఐదు వేల మంది గిరిజనులతోను, 11వ తేదీన డుంబ్రిగుడ మండలం చాపరాయిలో, 17వ తేదీన మారేడుమిల్లిలో యోగాంరఽధ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
యోగాంధ్రాను విజయవంతం చేయాలి
పాడేరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఆయా వినతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పక్కాగా పరిష్కరించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 4న అరకులోయ మ్యూజియం, రంపచోడవరంల్లో ఐదు వేల మంది గిరిజనులతోను, 11వ తేదీన డుంబ్రిగుడ మండలం చాపరాయిలో, 17వ తేదీన మారేడుమిల్లిలో యోగాంరఽధ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
మీ కోసం కార్యక్రమానికి 151 వినతులు
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత గిరిజనుల నుంచి 151 వినతులను స్వీకరించారు. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలో మాలగుమ్మి, మెట్ట బాదిపుట్టు, శరభాపుట్టు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని సర్పంచ్ వంతాల రత్న కోరగా, డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ గొరాపూర్ గ్రామస్థులు వి.రవికుమార్, పి.పూర్ణ తదితరులు గోరాపూర్ రైల్వే ట్రాక్ నుంచి పిత్తమారిగూడ గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని కోరారు. డుంబ్రిగుడ మండలం గసభ పంచాయతీ గొందివలస గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 260 విద్యార్థులున్నారని, దానిని ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ కొత్తవలస గ్రామానికి రోడ్డు నిర్మించాలని జి.మోహన్‌దాసు కోరారు. ఈ కార్యక్రమంలో డీపీవో బి.లవరాజు, సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ టి.కొండయ్య పడాల్, చిన్ననీటిపారుదల శాఖ డీఈఈ నాగేశ్వరరావు, జిల్లా ఉద్యానవనాధికారి పి.రమేశ్‌కుమార్‌రావు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి అప్పారావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అరకులోయ ఈఈ వేణుగోపాల్, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, స్థానిక తహసీల్దార్ వి. త్రినాథరావునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.