Share News

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:31 AM

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలన్నారు.

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో బ్రహ్మజీరావు

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పాడేరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు మండల విద్యాశాఖాధికారులు సంపూర్ణంగా హాజరుకాకపోవడంతో పాటు వారి పనితీరు బాగాలేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవోలు క్షేత్ర పర్యటనలు చేసి పాఠశాలల్లో విద్యార్థుల చేరిక ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆధార్‌ నమోదు, తల్లికి వందనం పెండింగ్‌ పనులు త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఇంటర్‌ విద్యలో పరిస్థితులపై ఆరా తీసి, కాలేజీల్లో ఉన్న అధ్యాపకులు, ఇతర అంశాలను తనకు నివేదించాలన్నారు. విద్యాలయాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, విద్యాభివృద్ధిని ఆశించిన స్థాయిలో సాధించాలని సూచించారు. విద్యార్థులకు బేస్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహించాలన్నారు. ఐసీడీ ఎస్‌, వైద్య ఆరోగ్య సేవలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అందాలని, బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. గర్భిణుల నమోదు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు, పోషకాహారం అందించాలని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సదరం సర్టిఫికెట్లను సకాలంలో అందించాలన్నారు. ఇతర శాఖలకు చెందిన ప్రగతిపైనా కలెక్టర్‌ ఆరా తీసి, పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు సింహాచలం, అపూర్వభరత్‌, సబ్‌కలెక్టర్‌ శుభం న ఖ్వోల్‌, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో బ్రహ్మజీరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ కె.కవిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:31 AM