స్పీకర్ సంకల్పం.. రైతుల ఆనందం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:50 AM
రెండు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజల చిరవాంఛ ఎట్టకేలకు నెరవేరింది. మండలంలోని గిడుతూరు నుంచి పక్కనే వున్న కోటవురట్ల మండలం సుంకపూరుకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ఇంతవరకు ఈ రెండు గ్రామాల మధ్య కనీసం మెటల్ రోడ్డు కూడా లేదు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో ఏకంగా తారు రోడ్డు ఏర్పాటైంది.
గిడుతూరు-సుంకపూరు మధ్య బీటీ రోడ్డు నిర్మాణం
రూ.1.8 కోట్లు మంజూరు చేయించిన అయ్యన్నపాత్రుడు
మాకవరపాలెం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రెండు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజల చిరవాంఛ ఎట్టకేలకు నెరవేరింది. మండలంలోని గిడుతూరు నుంచి పక్కనే వున్న కోటవురట్ల మండలం సుంకపూరుకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ఇంతవరకు ఈ రెండు గ్రామాల మధ్య కనీసం మెటల్ రోడ్డు కూడా లేదు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో ఏకంగా తారు రోడ్డు ఏర్పాటైంది. గిడుతూరు-సుంకపూరు మఽధ్య 2.5 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికి రూ.1.8 కోట్లు మంజూరు చేయించారు. గత ఏడాది డిసెంబరు రెండో తేదీన రోడ్డు నిర్మాణ పనులకు అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. ఇటీవల నిర్మాణ పనులు పూర్తికావడంతో స్థానిక నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు. గిడుతూరు గ్రామానికి చెందిన పలువురు రైతులకు వరహా నది అవతల పొలాలు వున్నాయి. వ్యవపాయ ఉత్పత్తులను ఇంటికి తీసుకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడేవారు. స్పీకర్ కృషితో రోడ్డు నిర్మాణం కావడంతో తమ కష్టాలు తొలిగాయని రైతులు సంతోషిస్తున్నారు.