నూకాంబికను దర్శించుకున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ జీఎం
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:23 AM
విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాఽథుర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ అంకుష్ గుప్తా దంపతులు ఆదివారం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.
అనకాపల్లి టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాఽథుర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ అంకుష్ గుప్తా దంపతులు ఆదివారం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో కేఎల్ సుధారాణి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో పూజలు చేసిన అనంతరం రైల్వే ఉన్నతాధికారులను సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.