సీఎంను కలిసిన దక్షిణ కోస్తా రైల్వే జీఎం
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:28 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ శుక్రవారం విజయవాడలో కలిసి జోన్‌లో జరుగుతున్న ప్రాజెక్టు పనులగురించి వివరించారు.
ప్రాజెక్టుల గురించి వివరించిన ఉన్నతాధికారి
విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ శుక్రవారం విజయవాడలో కలిసి జోన్‌లో జరుగుతున్న ప్రాజెక్టు పనులగురించి వివరించారు. ఆయనతో పాటు మరికొంతమంది రైల్వే అధికారులు కూడా వెళ్లి కొత్త జోన్ పనులు ఎక్కడి వరకూ వచ్చాయనేది తెలిపారు. విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సొనాకియా కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.