Share News

త్వరలో ఇంటింటికీ కొళాయి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:34 AM

పాయకరావుపేట నియోజకవర్గంలో త్వరలో ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు. మండలంలోని వేంపాడులో శుక్రవారం ఆమె మార్నింగ్‌ వాక్‌ చేశారు.

త్వరలో ఇంటింటికీ కొళాయి
వృద్ధురాలి యోగాక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి అనిత

హోం మంత్రి వి.అనిత

వేంపాడులో మార్నింగ్‌ వాక్‌

నక్కపల్లి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట నియోజకవర్గంలో త్వరలో ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత చెప్పారు. మండలంలోని వేంపాడులో శుక్రవారం ఆమె మార్నింగ్‌ వాక్‌ చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. బస్సులో పాఠశాలకు వెళుతున్న విద్యార్థులతో కరచాలనం చేశారు. వేంపాడులో మంచినీటి సమస్యను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తొలుత ఎన్టీఆర్‌, బాబూ ,జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె వెంట కూటమి పార్టీల నాయకులు వున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:34 AM