ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:49 PM
ప్రజలు, ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని జీసీసీ చైర్మన్, టీడీపీ అరకులోయ పార్లమెంటరీ అఽధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ తెలిపారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
పాడేరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ప్రజలు, ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని జీసీసీ చైర్మన్, టీడీపీ అరకులోయ పార్లమెంటరీ అఽధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ తెలిపారు. స్థానికంగా ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు సుమారు 43 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు హౌసింగ్ బిల్లులు ఇప్పించాలని, సాగు భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని, పలు గ్రామాలకు తాగునీటి సదుపాయం, రోడ్లు, డ్రెనేజీలు, సీసీ ర్యాంప్‌లు నిర్మించాలని వినతిపత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆయన సంబంఽధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణ, సాగర సుబ్బారావు, పి.శశిభూషన్, టి.సత్యనారాయణ, అమ్మన్న, సూర్యకాంతం, కొమ్మా రమా, మహేశ్వరి, మురళి, తదితరులు పాల్గొన్నారు.