విద్యతోనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:51 AM
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి మెగా పేరెంట్-టీచర్ మీట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో సదుపాయాలు, విద్యాబోధన, తదితర అంశాలు ఏవిధంగా ఉన్నాయనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు.
విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
జిల్లాస్థాయి మెగా పీటీఎంలో కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి మెగా పేరెంట్-టీచర్ మీట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో సదుపాయాలు, విద్యాబోధన, తదితర అంశాలు ఏవిధంగా ఉన్నాయనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో 80 శాతం మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిన పేరెంట్-టీచర్ మీట్ ఎంతో మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు అనేక కష్టాలు పడుతూ గిరిజన ప్రాంతం విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, గురువులను గౌరవిస్తూ వారి సూచనలు, సలహాలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించి, విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, ఎంఈవోలు ఎం.జాన్, సీహెచ్.సరస్వతి, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, సర్పంచ్ లకే పార్వతమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ పాంగి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.